ఘనంగా నిర్వహించిన యువనాయకులు చరణ్ రెడ్డి,పంట్రంగం అరుణ్ కళ్యాణ్
స్వర్ణసాగరం వాకాడు
మండల కేంద్రంలోని పల్లెపాలెం వద్ద గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు టీడీపీ యువ నాయకులు చరణ్ రెడ్డి,పంట్రంగం అరుణ్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శాసన సభ్యుల చిత్రపటంతో 30 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి డ్రోన్ సహాయంతో పాలాభిషేకం నిర్వహించారు.అనంతరం భారీ బాణాసంచా వేడుకల్లో టిడిపి సీనియర్ నాయకుడు సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు పంచాపెట్టారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతికై అహర్నిశలు శ్రమించే వ్యక్తి ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో పాటు భవిష్యత్తులో మరింత ఉన్నత రాజకీయ పదవులు అధిరోహించాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



