ePaper
Thursday, October 29, 2026
Homeఎడిటోరియల్కోట రాజకీయాల్లో కీలక పరిణామం..! వైసీపీకి షాక్.. 

కోట రాజకీయాల్లో కీలక పరిణామం..! వైసీపీకి షాక్.. 

📰 Generate e-Paper Clip

🔶టీడీపీలోకి దువ్వూరు రాజగోపాల్ రెడ్డి,ధ్రువ కుమార్ రెడ్డి చేరికకు రంగం సిద్ధం

కోట స్వర్ణసాగరం జులై 17

కోట మండల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక పాత్ర పోషించిన సిద్ధవరం పంచాయతీ ప్రముఖ నాయకులు దువ్వూరు రాజగోపాల్ రెడ్డి, దువ్వూరు ధ్రువ కుమార్ రెడ్డి తమ అనుచరులతో కలిసి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
గూడూరు శాసనసభ్యులు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి,మాజీ మండల అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమ్ రెడ్డి, కనుపూరు ముత్యాలమ్మ తల్లి ఆలయ ట్రస్ట్ చైర్మన్ దశదరామిరెడ్డి సిద్ధవరం గ్రామంలోని దువ్వూరు రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలిసి టిడిపిలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాజీ మండల అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ,ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ సూచనల మేరకు వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో విశేష సేవలందించిన దువ్వూరు రాజగోపాల్ రెడ్డి,ధ్రువ కుమార్ రెడ్డిలను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించామని తెలిపారు.ఈ ఆహ్వానానికి వారు సానుకూలంగా స్పందించారని,త్వరలో తమ అనుచరులతో కలిసి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని వెల్లడించారు.వారి చేరికతో పాటు సిద్ధవరం పంచాయతీతో పాటు కోట మండలంలోని పలువురు వైసీపీ నాయకులు,కార్యకర్తలు కూడా టిడిపి తీర్థం పుచ్చుకునే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వాకాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి,చంద్రభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular