ePaper
Thursday, October 29, 2026
Homeఎడిటోరియల్దళిత విద్యా హక్కులను కాలరాస్తే పోరాటం మరింత ఉధృతం చేస్తాం

దళిత విద్యా హక్కులను కాలరాస్తే పోరాటం మరింత ఉధృతం చేస్తాం

📰 Generate e-Paper Clip

🔵బహుజన యూత్ ఫోర్స్ లీగల్ అడ్వైజర్ దాసరి అశోక్ కాంబ్లే

కోట స్వర్ణసాగరం జులై 22

కోటలోని డా.బి.ఆర్. అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాల ఎత్తివేతకు నిరసనగా రెండో రోజు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు, దళిత సంఘాల నాయకులు కన్నీటి పర్యంతమవుతూ ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ లీగల్ అడ్వైజర్ దాసరి అశోక్ కాంబ్లే మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దళిత విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలను అకస్మాత్తుగా ఎత్తివేయడం రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కులను కాలరాయడమేనని ఆయన విమర్శించారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువును మధ్యలోనే నిలిపివేసే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి కోట ఎస్సీ గురుకులాన్ని పునఃప్రారంభించాలని, లేకపోతే బహుజన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జిల్లా,రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.అవసరమైతే చట్టపరమైన పోరాటంతో పాటు ప్రజాస్వామ్యబద్ధమైన నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఈ ఉద్యమంలో తల్లిదండ్రులు,ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఐక్యంగా నిలిచి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని దాసరి అశోక్ కాంబ్లే పిలుపునిచ్చారు.విద్యా హక్కుల పరిరక్షణ కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular