ePaper
Tuesday, May 5, 2026
Homeఎడిటోరియల్ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన గండవరం సుష్మారెడ్డి

ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన గండవరం సుష్మారెడ్డి

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 30

గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి భాద్యతలు చేపట్టిన సందర్భంగా కోట మండలం తిన్నెలపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకురాలు గండవరం సుష్మారెడ్డి ఎమ్మెల్యే కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా గండవరం సుష్మారెడ్డి మాట్లాడుతూ నిరంతర ప్రజాసేవకులు ప్రజా సమస్యల పరిష్కారమే ద్యేయంగా కృషి చేస్తున్న గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కి తెలుగుదేశం పార్టీ అధిష్టానం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి భాద్యతలు అప్పగించడం ఆయనకు ఆయన చేస్తున్న ప్రజా సేవకు దక్కిన గౌరవం అని అన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ ని ఎమ్మెల్యే స్థాయి నుండి మంత్రిగా చూడాలనే గూడూరు నియోజకవర్గం ప్రజల ఆకాంక్ష ను త్వరగా తీర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular