ePaper
Tuesday, May 5, 2026
Homeఎడిటోరియల్కోట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి జయంతి వేడుకలు

కోట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 30

మంచితనానికి మారు పేరు వివాదరహిత నాయకుడు రాజకీయాల్లో అజాతశత్రువు
ప్రజలే ఊపిరిగా బ్రతికిన ప్రజా సేవకుడు నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి అని కోట ఆర్యవైశ్య సంఘం సభ్యులు గునుపూడి నందా,తన్నీరు రత్నాకర్ రావు అన్నారు.కోట మండలం కోటలో దివంగత నేత నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 93 వ జయంతి వేడుకలను గురువారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ కమిటీ సభ్యులు గునుపూడి నందా,తన్నీరు రత్నాకర్ రావు ఆధ్వర్యంలో (ఆర్యవైశ్య సంఘం) ఘనంగా నిర్వహించారు.ముందుగా నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి  సంబరాలు జరుపుకున్నారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి జ్ఞాపకార్థం వేసవిలో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు, వాహనదారులకు,సుమారు వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ రాజకీయాలలోకి అడుగుపెట్టిన మొదటి నుండి తుది శ్వాస విడిచే వరకు ప్రజాసేవకే అంకితమై ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని అసెంబ్లీకి ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా,అసెంబ్లీలో సైతం తన గళాన్ని విప్పి అసెంబ్లీ టైగర్ అనే పేరు తెచ్చుకున్నారని అన్నారు.అధికారంలో ఉన్న లేకపోయినా తన గ్రామాన్ని తన ప్రాంత ప్రజలను ఏనాడు మరచిపోకుండా ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి శ్రీనివాసులు రెడ్డి అని అన్నారు.అయినా మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో శ్రమించారని,ఆనాడు నిర్మించిన ప్రతి ప్రభుత్వ భవనాలపై,కార్యాలయాలపై,ఎక్కడ చూసినా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరే కనిపిస్తుందని అభివృద్ధికి చిరునామా నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు తన్నీరు రత్నాకర్ రావు,గునుపూడి నంద,సొల్లేటి భాస్కర్, సొల్లుటి వెంకటేశ్వర్లు,నున్న లక్ష్మీనారాయణ, పూర్ణచంద్రరావు,అయ్యప్ప సురేష్,దుగ్గిశెట్టి శ్రీనివాసులు,ఓలేటి సత్యం,ప్రసన్న,శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య,సభ్యులు మల్లికార్జున్,ఆవుల సుబ్బయ్య నల్లపరెడ్ల అభిమానులు  పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular