ePaper
Tuesday, April 14, 2026
Homeఎడిటోరియల్శాశ్వత రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక- నెల్లూరు మోహన్ రెడ్డి

శాశ్వత రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక- నెల్లూరు మోహన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 3

శాశ్వత రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి అన్నారు.రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు గురువారం ఆమోదం తెలిపాయి. ఈనేపద్యంలో కోట మండలం,నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేత జిల్లా రైతు విభాగ కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర శాశ్విత రాజధానిగా అమరావతిని ఉభయ సభలు చట్ట భద్రత కలిగిస్తూ తీర్మానం చేయడం ప్రతి ఒక్క ఆంధ్రుడు గర్వించదగ్గ విషయం అని అన్నారు.రాజధాని సాధనకు కృషి చేసిన ప్రధాని మోదీ,కేంద్ర హోం మంత్రి అమిత్ షా,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ లకు అలాగే గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కి,ఈ బిల్లుకు మద్దతు పలికిన పార్టీలకు రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియచేశారు. వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటతో విధ్వంసం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని,రాజధానికి చట్టబద్దత కల్పించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం పెడితే కనీసం శాసనసభ సమావేశాలకు కూడా వైఎస్ఆర్సిపి నాయకులు హాజరు కాకపోవడం సిగ్గుచేటు అన్నారు.ఇలాంటి స్వార్థపూరిత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికలలో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular