కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 4
యేసు ప్రభువు సజీవుడని పునరుత్థానుడనే సత్యాన్ని సమాజానికి చాటిచెప్పడమే రన్ ఫర్ జీసస్ అని టిడిపి నేత షేక్ జలీల్ అహ్మద్ అన్నారు.కోటలో శనివారం నిర్వహించిన అన్ని క్రైస్తవ సంఘాల ఐక్యత ర్యాలీ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో కోట మండల టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ రన్ ఫర్ జీసస్ అనేది గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ సందర్బంగా,యేసుక్రీస్తు సిలువ మరణం,పునరుద్ధాన సందేశాన్ని సమాజానికి చాటిచెప్పే అతిపెద్ద క్రైస్తవ పరివర్తన మరియు ఐక్యత ర్యాలీ అని అన్నారు.క్రైస్తవ సంఘాలన్ని సమైక్యంగా కలిసి యేసు క్రీస్తుకు శిలువ వేయడం క్రీస్తు పునరుత్థానం వంటి అంశాల ప్రాధాన్యతను తెలియజేప్పేందుకు ప్రతి యేటా నిర్వహించే ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న క్రైస్తవ పెద్దల ఐక్యతను కొనియాడారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తిరుమలశెట్టి కోటేశ్వరరావు,నౌషాద్ క్రైస్తవ పాస్టర్లు తదితరులున్నారు.



