ePaper
Tuesday, April 14, 2026
Homeఎడిటోరియల్ఎమ్మెల్యే సునీల్ ను సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి

ఎమ్మెల్యే సునీల్ ను సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 4

కోట మండలం గూడలి గ్రామంలో వెలసియున్న శ్రీ కామాక్షి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం నందు ఈనెల 5వ తేదీ ఆదివారం నుండి 15వ తేదీ వరకు జరుగు శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాలకు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ను టిడిపి నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి శనివారం గూడూరులో ఎమ్మెల్యే నివాసంలో ఆహ్వాన పత్రిక అందించి ప్రత్యేక ఆహ్వానం పలికారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన శ్రీ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అతిథిగా రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తప్పనిసరిగా బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు అవుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కార్తీక్ స్వామి,మధు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular