*కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 4*
కోట మండలం కోటలో శనివారం బహుజన యూత్ ఫోర్స్ నాయకులు కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.కమిటీ కార్యచరణకు సంబంధించి పలు విషయాలు చర్చించారు.ఈ నేపథ్యంలో బహుజన యూత్ ఫోర్స్ (బి.వై.ఎఫ్) గూడూరు నియోజకవర్గం కన్వీనర్ గా గుణపాడు గ్రామానికి చెందిన అంబేద్కర్ యూత్ సేవా సమితి అధ్యక్షులు ఫౌండర్ అంబేద్కరిస్ట్ శ్రీరామ్ శివప్రసాద్ (శంకర్) ఏకగ్రీవంగా ఎన్నిక అయిన సందర్భంగా కోటలో శనివారం బహుజన యూత్ ఫోర్ ఆధ్వర్యంలో నాయకులు శ్రీరామ్ శివప్రసాద్ ని శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీరామ్ శివప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి గ్రామంలో ప్రతి బహుజనుడికి అర్థమయ్యే రీతిలో తెలియజేసేందుకు సంస్థ ద్వారా కృషి చేస్తానన్నారు.ఏప్రిల్ 11వ తేదీ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి,14వ తేదీ అంబేద్కర్ జయంతి వేడుకలను కోటలో బహుజన యూత్ పోర్స్ ఆధ్వర్యంలో సమాజానికి బహుజన వాదాన్ని చాటి చెప్పే రీతిలో మహనీయుల జయంతి వేడుకలను జరపబోతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దాసరి సుందరం,కర్లపూడి వెంకట రమణయ్య,దార్ల ఏడుకొండలు,కనుపూరు కృష్ణయ్య,మీడియా కోఆర్డినేటర్ పాకంచెన్నకేశవులు,కో కన్వీనర్లు కుదురు సూర్య,మీజూరు మురళి,జోరెపల్లి తేజ,తీపలపూడి హరిబాబు,యర్రబోతు నాగేంద్రబాబు,దాసరి అశోక్ కాంబ్లే,పేర్నాటి చంద్ర ప్రకాష్,పేర్నాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.



