ePaper
Wednesday, June 3, 2026
Homeఎడిటోరియల్అంబేద్కరిస్టు కీ.శే పర్రి వెంకట రమణయ్య జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్

అంబేద్కరిస్టు కీ.శే పర్రి వెంకట రమణయ్య జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మే 10

చిట్టమూరు మండలం గుణపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాలతో పలు సేవా కార్యక్రమాలు చేసిన అంబేడ్కరిస్టు పర్రి వెంకట రమణయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో కీర్తిశేషులు వర్రీ వెంకట రమణయ్య జ్ఞాపకార్ధంగా పి.వి.ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం అంబేద్కర్ యూత్ సభ్యులు ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో మొత్తం 60 జట్టులు పోటీ పడుతున్నాయి.విజేతలైన వారికి మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు,రెండవ బహుమతి పది వేల రూపాయలు మూడవ బహుమతి షీల్డ్ ను అందజేస్తామని ప్రకటించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గునపాడు అంబేడ్కర్ యూత్ మరియు టీచర్ ఈదూరు వెంకటేశ్వర్లు, తూపిలి రమేష్,సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మేర్లపాక నారాయణ,పీఈటీ టీచర్ ధనుంజయ,తూపిలి సుధీర్,నెల్లూరు రామకృష్ణ,కానిస్టేబుల్ గోవర్ధన్,కానిస్టేబుల్ రాయపు మధుసూదన్,బహుజన యూత్ ఫోర్స్ కన్వీనర్ శ్రీరాం శివ ప్రసాద్ మరియు బహుజన యూత్ ఫోర్స్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular