ePaper
Wednesday, June 3, 2026
Homeఎడిటోరియల్కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదు - కోకర్ల మధు యాదవ్

కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదు – కోకర్ల మధు యాదవ్

📰 Generate e-Paper Clip

🔶కూటమి ప్రభుత్వ అధినాయకులను విమర్శించే స్థాయి నీది కాదు-మధు యాదవ్

🔶చంద్రబాబు నాయుడు పాలనలో అటు రాష్ట్రం సునీల్ కుమార్ పాలనలో ఇటు నియోజకవర్గం ఎనలేని అభివృద్ధి

🔶రాజకీయ గుర్తింపు తెచ్చిన పార్టీకే వెన్నుపోటా

🔶అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూటమి నాయకులను విమర్శిస్తే తగిన భారీ మూల్యం చెల్లించక తప్పదు

కోట స్వర్ణసాగరం మే 9

కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తే సహించేదే లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు కోకర్ల మధు యాదవ్ అన్నారు. కోట మండలం కోటలో శనివారం తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు టీడీపీ నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు కందలి బాలకృష్ణ యాదవ్ కూటమి ప్రభుత్వ పాలనపై చేసిన విమర్శలపై విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కోకర్ల మధు యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో అటు రాష్ట్రం, గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ పాలలో ఇటు నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని అలాంటి పార్టీపై అదే పార్టీలో పదవులు అధిరోహించిన కందలి బాలకృష్ణ యాదవ్ విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు.కందలి బాలకృష్ణ యాదవ్ జీవితానికి రాజకీయ గుర్తింపు ఇచ్చిన పార్టీ పైనే బీసీలకు అన్యాయం జరిగిందంటూ అసత్యపు ప్రచారాలు చేయడం మంచి పద్ధతి కాదని,ఎన్నో సంవత్సరాలుగా టిడిపి ప్రభుత్వంలో పలు పదవులను అనుభవిస్తూ ఆ పార్టీపైనే విమర్శలు చేస్తూ వెన్నుపోటు పొడవడం బాలకృష్ణ యాదవ్ రాజకీయ పతనానికి ఆరంభం అని అన్నారు.ప్రజా అభివృద్ధిపై అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వంపై బాలకృష్ణ యాదవ్ చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలని లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కోట మండల తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular