కోట స్వర్ణసాగరం మే 20
కోట మండలం కోటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం నందమూరి అభిమానులు, మీజురు మధు బాబు,పంట్రంగం చంటి, మీజురు రవి,తిరుమల పాల డైరీ చైర్మన్ అవయమూకారి శ్రీనివాసులు నాయుడు,ల ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ 43 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నడుమ జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటంతో కూడిన భారీ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టి జన్మదిన సంబరాలు జరుపుకున్నారు.నిరుపేదలకు సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం కోట సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు ఆసుపత్రి డాక్టర్లు నర్సులు సిబ్బంది చేత అన్నం ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మీజురు మధు బాబు,పంట్రంగం చంటి,మీజురు రవి, తిరుమల పాల డైరీ చైర్మన్ అవయమూకారి శ్రీనివాసులు నాయుడు లు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నరని,నందమూరి వంశంలో జన్మించి తాత నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నేడు టాలీవుడ్‌లో తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగారన్నారు. తన అద్భుతమైన నటన,డ్యాన్స్ మరియు డైలాగ్ డెలివరీతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించే రాబోయే చిత్రాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ కార్యక్రమంలో శశి,కోటి,మధు,పవన్,శ్రీను,శ్రీకాంత్, గురవయ్య,వెంకటేష్,వసంత్,కౌశిక్,మరియు ప్రజలు నందమూరి అభిమానులు పాల్గొన్నారు.



