ePaper
Wednesday, June 3, 2026
Homeఎడిటోరియల్దువ్వూరు మునిరత్నం రెడ్డి, మంగలక్ష్మి ల 6వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

దువ్వూరు మునిరత్నం రెడ్డి, మంగలక్ష్మి ల 6వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మే 20

కోట మండలం అల్లారెడ్డి శ్యామసుందరపురం కాలనీలో కట్ట చివర వెలసి ఉన్న శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామికి ఆలయ నిర్వాహకులు శరవణ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.దువ్వూరు మునిరత్నం రెడ్డి మంగలక్ష్మి దంపతుల 6వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు వంశీకృష్ణారెడ్డి హోటల్ అధినేత దువ్వూరు వంశీ కృష్ణారెడ్డి,కావ్య,దంపతుల కుమారుడు మహేందర్ రెడ్డి లు అభయ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ అన్నదాన వినియోగ కార్యక్రమం నిర్వహించారు.ఈనేపద్యంలో ఆలయ నిర్వహకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం వంశీకృష్ణ రెడ్డి దంపతులకు స్వామి వారి కండువా వేసి తీర్థ ప్రసాదాలు అందించారు.ఈ సందర్భంగా ఆలయం నిర్వాహకులు శరవణ మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా వంశీ కృష్ణారెడ్డి హోటల్ అధినేత వంశీకృష్ణారెడ్డి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం భక్తులకు పేదలకు భారీ అన్నదాన కార్యక్రమమును నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు.తల్లిదండ్రులు చనిపోతే భారం తగ్గించుకునే వారసులు ఉన్న ఈ రోజుల్లో తన తల్లిదండ్రుల వర్ధంతి వేడుకలను వందల మంది నిరుపేదల ఆకలి తీర్చే విధంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం పలువురికి ఆదర్శం అన్నారు. అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందిస్తున్న దువ్వూరు వంశీకృష్ణారెడ్డి కావ్య దంపతులకు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో భక్తులు,కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular