🔶ప్రైవేట్ బస్సు ప్రమాద బాధితురాలికి అండగా ఎమ్మెల్యే పాశిం
🔶షాపు నష్టపోయిన నాగూరమ్మకు రూ.30 వేల నష్టపరిహారం అందజేత
🔶డా.పాశిం సునీల్ కుమార్ సహకారంతో కోట టీడీపీ నాయకుల చేతుల మీదుగా ఆర్థిక సాయం
కోట స్వర్ణసాగరం జులై 18
కోట మండలం చంద్రశేఖరపురం వద్ద ఇటీవల జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన షాపు బాధితురాలు నాగూరమ్మకు గూడూరు శాసనసభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.పాశిం సునీల్ కుమార్ అండగా నిలిచారు అండగా నిలిచారు.ఎమ్మెల్యే సహకారంతో బాధితురాలి శనివారం రూ.30,000 నష్టపరిహారంను కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు,జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్,రైతు విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి, వెంకన్నపాలెం మాజీ సర్పంచ్ కోకర్ల మధు యాదవ్,పార్టీ నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి,మైనార్టీ నాయకులు నౌషద్ భాష,అక్బర్ బాషా,మస్తాన్ భాషల చేతుల మీదుగా బాధితురాలికి అందజేశారు.
ఈ సందర్భంగా బాధితురాలు నాగూరమ్మ మాట్లాడుతూ ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో నా షాపు పూర్తిగా దెబ్బతిని తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను.ఆ క్లిష్ట సమయంలో నా పరిస్థితిని గుర్తించి,ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ చొరవతో నాకు నష్టపరిహారం అందేలా కృషి చేసిన కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.ఈ సందర్భంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడం ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేస్తున్న నిజమైన ప్రజాసేవకు నిదర్శనం అని అన్నారు.ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబానికి వెంటనే స్పందించి ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే డా.పాశిం సునీల్ కుమార్ సేవాభావం అభినందనీయమని కొనియాడారు.స్థానిక ప్రజల సమస్యలపై స్పందిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ముందుండే ప్రజానాయకుడిగా ఎమ్మెల్యే డా.పాశిం సునీల్ కుమార్ మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.


