ePaper
Friday, October 30, 2026
Homeఎడిటోరియల్గుండెపోటుతో మహిళ మృతి-బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేయూత

గుండెపోటుతో మహిళ మృతి-బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేయూత

📰 Generate e-Paper Clip

టీడీపీ నేత పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి వినతితో స్పందించిన ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం అందజేత

కోట స్వర్ణసాగరం జులై 15

కోట మండలం గూడలి గ్రామంలోని శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న గుంటక వెంకటసుబ్బయ్య సతీమణి గుంటక పోలమ్మ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషాద ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ విషయం తెలుసుకున్న గూడలి పంచాయతీ టీడీపీ నాయకులు పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించి,వారి పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.సంఘటనపై స్పందించిన ఎమ్మెల్యే,తన దాతృత్వంతో బాధిత కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు.ఎమ్మెల్యే సునీల్ కుమార్ దాతృత్వంతో టీడీపీ నాయకులు పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా  బుధవారం గుంటక వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేసి, ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ, కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఎమ్మెల్యే చూపిన మానవతా దృక్పథానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు,గ్రామ పెద్దలు,దేవస్థానం ప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొని గుంటక పోలమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular