ePaper
Thursday, October 29, 2026
Homeఎడిటోరియల్చెరుకుమూడి ఘటనపై బీఎస్పీ-బహుజన యూత్ ఫోర్స్ తీవ్ర ఆగ్రహం

చెరుకుమూడి ఘటనపై బీఎస్పీ-బహుజన యూత్ ఫోర్స్ తీవ్ర ఆగ్రహం

📰 Generate e-Paper Clip

🔴ఏడుకొండలు మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి.

🔴బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందిల గౌతమ్ డిమాండ్

కోట స్వర్ణసాగరం జులై 19

మనుబోలు మండలం చెరుకుమూడి గ్రామానికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తి పోలీసుల విచారణలో మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ నేపథ్యంలో,బాధిత కుటుంబాన్ని శనివారం బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర నాయకత్వం మరియు బహుజన యూత్ ఫోర్స్ నాయకులు పరామర్శించారు. ఈసందర్భంగా బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందిల గౌతమ్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (రిటైర్డ్ జిల్లా జడ్జి) గుర్రప్ప,నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీరాం,జిల్లా నాయకులు, బహుజన యూత్ ఫోర్స్ నాయకులు, సభ్యులు గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి,వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అనంతరం మీడియాతో మాట్లాడిన బందిల గౌతమ్ మాట్లాడుతూ,దొంగతనం కేసు విచారణ పేరుతో ఒక వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టి ప్రాణాలు తీసే హక్కు పోలీసులకు లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రజలకు న్యాయం ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు.ఘటనకు బాధ్యులైన మనుబోలు ఎస్‌ఐ హనీఫ్,కానిస్టేబుల్ మాధవ్‌లపై వెంటనే హత్య కేసు నమోదు చేసి,సేవల నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని,పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని వారు కోరారు.ఈ ఘటనపై నిష్పాక్షికంగా,పారదర్శకంగా దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనలో బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోకపోతే బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని బందిల గౌతమ్ హెచ్చరించారు.పేద,బడుగు, బలహీన వర్గాలపై జరిగే ప్రతి అన్యాయానికి బీఎస్పీ అండగా ఉంటుంది.బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ,బహుజన యూత్ ఫోర్స్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular