ePaper
Friday, October 30, 2026
Homeఎడిటోరియల్నిరుపేద విద్యార్థులకు అండగా శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి

నిరుపేద విద్యార్థులకు అండగా శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి

📰 Generate e-Paper Clip

🔷పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన 40 మంది పేద విద్యార్థులకు రెండు లక్ష రూపాయలు ఆర్థిక చేయూత

🔷ఇంజనీరింగ్ విద్యార్థులు 30 మందికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక చేయూత

🔷శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి వారికి రుణపడి ఉంటాం విద్యార్థుల తల్లిదండ్రులు

కోట స్వర్ణసాగరం జులై 12

కోట మండలం కోటలోని శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఆదివారం శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదో తరగతి మరియు ఇంజనీరింగ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉత్తమ పేద విద్యార్థిని, విద్యార్థులకు దాతల సహకారంతో ప్రోత్సాహ నగదు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోటమ్మ తల్లి ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి,జీకే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ టి గోపాలకృష్ణయ్య పాల్గొన్నారు. ఇందులో భాగంగా 10వ తరగతి పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభను కనబరిచిన 40 మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి 5000 రూపాయలు లెక్కన రెండు లక్షల రూపాయలు,30 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒక్కొక్కరికి 10000 రూపాయలు లెక్కన మూడు లక్షల రూపాయలు నగదు ప్రోత్సాహ బహుమతులను అతిథుల చేతుల మీదుగా అందించి వారిని అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ షిరిడి అక్షయ సేవా సమితి నిరుపేద విద్యార్థులకు గొప్ప వరమని అన్నారు.అల్లం రమణయ్య శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి సంస్థను స్థాపించి ఎంతోమంది నిరుపేదలకు అభాగ్యులకు అండగా నిలిచారని వారి సేవలను కొనియాడారు.నిత్యం ప్రజా సేవకు దైవ సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన అల్లం రమణయ్య సేవలు చిరస్మరణీయమని అన్నారు.ప్రతి పేద విద్యార్థి జీవితాన్ని మార్చే శక్తి ఒక విద్యకు మాత్రమే ఉందని విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరూ మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు వారి అమూల్యమైన సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పేదరికాన్ని తమ బిడ్డల ప్రతిభను గుర్తించి తమకు అండగా నిలుస్తున్న శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. అనంతరం పదవి విరమణ పొందిన 9 మంది ఉపాధ్యాయులకు సన్మానాలు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కర్లపూడి కృష్ణయ్య,దువ్వూరు కరుణాకర్ రెడ్డి,నసీం ఆలీ,ట్రస్ట్ సభ్యులు కలిచేటి భాస్కర్ రెడ్డి, నాగలాపురం గిరిధర్ రెడ్డి,పెళ్లూరు కోటేశ్వర్ రెడ్డి,రావూరి వెంకటేశ్వర్లు,కొండూరు వెంకట రమణారెడ్డి,శివరామయ్య శెట్టి, రావూరు చంద్రాచారి,శాఖమూరి సుబ్బరామయ్య,ఆవుల సుబ్బయ్య, వెంబులూరు బాబురావు,పన్నగ సాయి,అల్లం రమణయ్య,పులేంద్ర నాగూర్ రెడ్డి,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular