ePaper
Thursday, October 29, 2026
Homeఎడిటోరియల్నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరుపల్లి అభివృద్ధికి శ్రీకారం

నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరుపల్లి అభివృద్ధికి శ్రీకారం

📰 Generate e-Paper Clip

నెల్లూరుపల్లి దళితవాడలో డ్రైనేజ్ కాలువ నిర్మాణానికి భూమిపూజ

దళితవాడలో మౌలిక వసతుల మెరుగుదలే ప్రభుత్వ లక్ష్యం నెల్లూరు మోహన్ రెడ్డి

కోట స్వర్ణసాగరం జులై 20

కోట మండలం నెల్లూరుపల్లి దళితవాడలో టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రైనేజ్ కాలువ నిర్మాణ పనులకు సోమవారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా నేదురుమల్లి హరిప్రసాద్ రెడ్డి, వేణుంబాక అశ్విన్ రెడ్డి,ముంగర మురళి రెడ్డి,నేదురుమల్లి కిరణ్ కుమార్ రెడ్డి,పెనుబోలు సాయికుమార్ రెడ్డి,ఎంపీటీసీ యానాటి నారాయణ చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామానికి అడిగిన వెంటనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ గ్రామ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.దళితవాడలో గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ సహకారంతో ఎన్నాళ్లుగానో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఈ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రజలకు మెరుగైన జీవన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని తెలిపారు.మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఈ భూమిపూజ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, గ్రామ పెద్దలు,స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular