ePaper
Thursday, October 29, 2026
Homeకోటకోటలో వైసీపీ జెండా ఎగరడం ఖాయం

కోటలో వైసీపీ జెండా ఎగరడం ఖాయం

📰 Generate e-Paper Clip

స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యం: ప్రసన్నకుమార్‌రెడ్డి

స్వర్ణసాగరం, కోట:

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోట మండలంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటుతుందని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. అధికార కూటమిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉందని పేర్కొంటూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. శనివారం కోట దళితవాడలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో స్థానిక వైసీపీ సీనియర్ నేత పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డితో కలిసి ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరిగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తుందని, అధికార పార్టీ నుంచి ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులకు అండగా ఉంటామని చెప్పారు.

పేర్నాటికి ఎమ్మెల్యే అవకాశం కల్పించాలి

పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి పార్టీ పట్ల చూపుతున్న విధేయతను ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రస్తావించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఏర్పాటు చేయకముందు నుంచే ఆయన వెంట పేర్నాటి నడిచారని, పాదయాత్ర, ఓదార్పు యాత్ర సమయంలోనూ గూడూరు నియోజకవర్గంలో ఆయనకు సహకరించారని పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు.ప్రజలకు సేవ చేయాలనే తపన, పార్టీ పట్ల విధేయత ఉన్న పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డికి నెల్లూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరినట్లు ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో నేతల ప్రకటనలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుండగా.. కోట మండలంలో ప్రజల తీర్పు ఎటువైపు ఉంటుందన్నది ఎన్నికల ఫలితాలతోనే తేలనుంది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular