ePaper
Tuesday, April 14, 2026
Homeఆంధ్రప్రదేశ్దైవ ఆశీస్సులతో మాచర్ల వారిపాలెంలో సంక్రాంతి వెలుగులు ప్రసరించాలి

దైవ ఆశీస్సులతో మాచర్ల వారిపాలెంలో సంక్రాంతి వెలుగులు ప్రసరించాలి

📰 Generate e-Paper Clip


గ్రామదేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఎన్ డి ఆర్ సంస్థల అధినేత ఆది కేశవుల రెడ్డి

తోటపల్లి గూడూరు స్వర్ణసాగరం

దైవ ఆశీస్సులతో తమ స్వగ్రామం మాచర్ల వారి పాలెం లో ప్రతి ఇంట సంక్రాంతి వెలుగులు నిండాలని ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్ డి ఆర్ సంస్థల అధినేత నాయుడు ఆదికేశవుల రెడ్డి పేర్కొన్నారు.  మంగళవారం స్థానిక గ్రామదేవత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ కుటుంబీకులు ఆనవాయితీగా జరుపుకుంటున్న సంక్రాంతి వేడుకలు తనకెంతో ఆనందం కలిగిస్తున్నట్లు తెలిపారు.  బుధవారం విద్యార్థులకు ఆటల పోటీలు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. చలికాలం కావడంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. తమ స్వగ్రామాన్ని సంక్రాంతి సందర్భంగా వెలుగులలో నింపాలన్న ప్రధాన ఉద్దేశం అదే విధంగా విద్యార్థులను ప్రోత్సహించే క్రమంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తన పూర్వీకుల బాటలు తాను తమ కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు  ఆదికేశవుల రెడ్డి పేర్కొన్నారు

.
  .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular