కోట స్వర్ణసాగరం జనవరి 17
కోట మండలం కోటలోని నార్త్ గిరిజన కాలనీలో టిడిపి నేత షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా మహిళలకు శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు జలీల్ అహ్మద్ గిరిజన మహిళలు అలంకరించిన రంగవల్లులను పరిశీలించి గెలుపు పొందిన మహిళలకు ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు అందించారు. టీడీపీ నాయకులు నార్త్ గిరిజన కాలనీలో ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు వివిధ రకాల బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో జలీల్ అహ్మద్ మాట్లాడుతూ గిరిజన ప్రాంత మహిళలు సుఖసంతోషాలతో పండుగను జరుపుకోవాలని గూడూరు శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్ యొక్క కోరిక మేరకు నార్త్ గిరిజన కాలనీలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.రంగవల్లుల పోటీలు అటహాసంగా పండుగ వాతావరణం లో ప్రతి సంవత్సరం ఇలాగే మరింత సౌకర్యవంతంగా జరుపుకోవాలని ఆయనకాంక్షించారు.ప్రతి మహిళ రంగవల్లులు పోటీలో అద్భుత ప్రదర్శన ఇచ్చారని అభినందించారు.ఈ కార్యక్రమంలో మండలపార్టీ ప్రధానకార్యదర్శి తిరుమలశెట్టి.కోటేశ్వరరావు కోట బిట్ 3 ఎంపీటీసీ షేక్ షంషుద్దీన్,కోట బిట్టు వన్ ఎంపీటీసీ దారా సురేష్,ఏఎంసి చైర్మన్ మర్రి ప్రమీల,ఎఏంసి డైరెక్టర్ సిద్దపరెడ్డి పోలమ్మ, తెలుగుదేశంపార్టీ నాయకులు నందం మోహన్,షేక్ నౌషాద్,షిరిడిసాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య,పన్నగ సాయి తదితరులు పాల్గొన్నారు.



