ePaper
Tuesday, April 14, 2026
Homeఎడిటోరియల్తరతరాలకు స్ఫూర్తినిచ్చే చరిత్రను సృష్టించిన తెలుగు వెలుగు ఎన్టీఆర్--టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్

తరతరాలకు స్ఫూర్తినిచ్చే చరిత్రను సృష్టించిన తెలుగు వెలుగు ఎన్టీఆర్–టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జనవరి 18

తరతరాలకు స్ఫూర్తినిచ్చే చరిత్రను సృష్టించిన తెలుగు వెలుగు స్వర్గీయ నందమూరి తారకరామారావు అని తిరుపతి జిల్లా పార్లమెంట్ మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ పేర్కొన్నారు.ఆదివారం కోట మండలం కోటలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ అధ్యక్షతన స్వర్గీయ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ నేపథ్యంలో కోటమ్మ గుడి గిరిజన కాలనీలో పేదలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం కుమార్ ఆదేశాల మేరకు మండల పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరపడం జరిగిందన్నారు.సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చాటుతూ ప్రజా క్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన  మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.నేడు అమలులో ఉన్న అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి కేజీ బియ్యం రెండు రూపాయలకే పేదలకు అందించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో టిడిపి కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి,మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి,తిరుమలశెట్టి కోటేశ్వరరావు, వెంకట కృష్ణారెడ్డి, చాపల శ్రీనివాసులు,మీజూరు మల్లికార్జునరావు,మర్రి పోలయ్య,దారా సురేష్,షేక్ షంషుద్దీ,ఇనమాల అనూక్,కావలి చిరంజీవి, కావలి ప్రశాంత్,నాయబ్,నందన్ మోహన్ తిరుమలశెట్టి పోలమ్మ,సుహాసిని,తెలుగుదేశం పార్టీ కోట మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular