అమ్మవారికి హరతి సమర్పించి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్న మోహన్ రెడ్డి
కోట స్వర్ణసాగరం జనవరి 19
కోట మండలం కొత్తపాలెం పెద్ద హరిజనవాడలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం మేరకు సంక్రాంతి సంబరాల్లో భాగంగా చివరి పండుగ అయిన ఏడాది పండుగ నాడు గ్రామదేవత పోలేరమ్మకు విశిష్ట పూజలు నైవేద్యం సమర్పణలతో ఘనంగా గ్రామోత్సవం నిర్వహించబడుతుంది.అందులో భాగంగానే ఈఏడాది గ్రామ దేవత పోలేరమ్మకు విశిష్ట పూజలు మేళతాళాలతో నైవేద్య సమర్పణలతో అమ్మవారు విశిష్ట పూజలు అందుకున్నారు. అమ్మవారికి ఘనంగా పూల అలంకరణలతో గ్రామోత్సవం నిర్వహించారు.అమ్మవారి గ్రామోత్సవానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశంపార్టీ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి విచ్చేసి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికు హారతి సమర్పించి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ కొత్తపాలెం గ్రామంలో అనాదిగా అనుమతిగా వస్తున్న క్రమంలో గత దశాబ్ద కాలం నుండి అమ్మవారికి విశేషాలంకరణలతో జరిపిస్తున్నారు గ్రామ ప్రజలను అమ్మవారు ఆయురారోగ్యాలతో పాడిపంటలతో సుఖ సంతోషాలతో మరింత దీవించి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కట్ట శంకర్ రెడ్డి.శానంపూడి గోపాల్ రెడ్డి,కందల రాధాకృష్ణారెడ్డి,కనుమలు చంద్రారెడ్డి, పెనుబోలు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



