ePaper
Wednesday, April 15, 2026
Homeఎడిటోరియల్విద్యార్థులు మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలి...డాక్టర్ షేక్ జిలాని బాష

విద్యార్థులు మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలి…డాక్టర్ షేక్ జిలాని బాష

📰 Generate e-Paper Clip

చిట్టమూరు స్వర్ణసాగరం ఫిబ్రవరి 19

విద్యార్థులు పట్టుదలతో చదివి పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని నేషనల్ హ్యుమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ డాక్టర్ షేక్ జిలాని బాష అన్నారు. గురువారం చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలోని పుచ్చలపల్లి పరందామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేషనల్ ఆర్.టి.ఐ ప్రొటెక్షన్ ఫోర్స్&నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ చైర్మన్ జిలాని బాష ఆధ్వర్యంలో సర్వారెడ్డి యుగంధర్ రెడ్డి దాతృత్వంతో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు దృష్ట్యా పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లు విద్యాసామాగ్రిని పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణంలో జిలాని బాష చేతులు మీదుగా మొక్కలు నాటారు.ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ షేక్ జిలాని భాష మాట్లాడుతూ విద్యార్థులకు పదోవ తరగతి ప్రధాన ఘట్టమని ప్రతి ఒక్కరూ పట్టుదలతో మార్కులు సాధించి ఉన్నతమైన శిఖరాలకు ఎదిగి ఇటు కన్న తల్లిదండ్రులకు,అటు చదివిన పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు. విద్యార్థులు చదువు,క్రీడలలో ముందు ఉండడంతో పాటు, సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని,ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి ఉండాలని విద్యార్థులకు అవగాహన కలిగించారు.ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సభ్యులు నక్కా సుధాకర్,నీలం సురేంద్ర రెడ్డి షేక్ షాజీ, కృష్ణవేణమ్మ,షేక్ మీరా మోహిదిన్,పర్వీన్,స్వప్న, చెన్నకేశవులు,జనార్దన్ రోటరీ క్లబ్ ప్రతినిధి ఎన్.రామ్ మోహన్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు పార్థసారధి,ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular