కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 19
బాల్యవహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బాల్య వివాహాలను ప్రోత్సహించిన వారు చట్టరీత్య శిక్షార్హులు అని కోట మండల సిడిపిఓ మునికుమారి పేర్కొన్నారు.గురువారం కోట మండలం గూడలి గ్రామంలోని గిరిజన కాలనీ ప్రాథమిక పాఠశాలలో సిడిపిఓ మునికుమారి మహిళలకు బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.బాల్య వ్యవహారాలను చేయడం ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని అన్నారు.ఆడపిల్ల వయస్సు 18 సంవత్సరాలు నిండక ముందే వివాహం జరిపిస్తే మానసిక, శారీరక అనర్థాలు సంభవిస్తాయని తెలిపారు. వారికి జన్మించే పిల్లలు కూడా ఆరోగ్యకరంగా ఉండరని వైకల్యం కలిగి ఉంటారనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని సూచించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లలకు బాల్య వివాహం చేయరాదని వయస్సు నిండే వరకు వేచి చూడాలని సీడీపీఓ తెలిపారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కవిత,పాఠశాల టీచర్ మల్లిఖార్జున్, ఏఎన్ఎం సుగుణ,ప్రవళిక,ఆశా వర్కర్ తులసి, ఆయా సులోచన గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.



