ePaper
Wednesday, April 15, 2026
Homeఎడిటోరియల్స్వార్థపూరిత రాజకీయాలు మానుకొని ప్రజా శ్రేయస్సుకు సహకరించండి-కోట ఎంపీటీసీలు

స్వార్థపూరిత రాజకీయాలు మానుకొని ప్రజా శ్రేయస్సుకు సహకరించండి-కోట ఎంపీటీసీలు

📰 Generate e-Paper Clip

కోట మండలం కోట దళితవాడలో ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నూతనంగా నిర్మిస్తున్న హెల్త్ సెంటర్ ను ఆపించడానికి కొంతమంది స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారని,స్వార్థపూరిత రాజకీయాలు మానుకుని ప్రజా అభివృద్ధికి సహకరిస్తే బాగుంటుంది అని ఎంపీటీసీలు షేక్ శంషుద్దీన్,దారా సురేష్ లు అన్నారు. సోమవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో తహసిల్దార్ జయ జయ రావు కు హెల్త్ సెంటర్ నిర్మాణ విషయంపై విచారణ జరిపి నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఎంపీటీసీలు,దారా సురేష్,షేక్ శంషుద్దీన్ లు మాట్లాడుతూ కోట దళితవాడ, నార్త్ గిరిజన కాలనీ,దామరగుంట గిరిజన కాలనీలలో సుమారు 1000 కుటుంబాల నిరుపేదలు నివసిస్తున్నారని,వారి అభ్యర్థన మేరకు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ పేద ప్రజలకు హెల్త్ సెంటర్ ను నిర్మించాలని 36 లక్షల రూపాయల నిధులతో హెల్త్ సెంటర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారన్నారు.అందరికీ అనుకూలంగా ఉంటుందని స్థానిక తహసిల్దార్ జయ జయ రావు దళితవాడలోని ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు.హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న సమయంలో  కొంతమంది స్వార్ధ రాజకీయాలతో ప్రజలకు ఉపయోగపడే హెల్త్ సెంటర్ ను ఆపించాలని హెల్త్ సెంటర్ లేకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నారని అన్నారు.స్వార్ధ రాజకీయాలను మానుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం మంచిదని అన్నారు.ప్రస్తుతం హెల్త్ సెంటర్ నిర్మిస్తున్న స్థలం అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని, హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు అక్కడ లేవని,అన్ని అనుమతులతో హెల్త్ సెంటర్ ను నిర్మిస్తున్నామన్నారు.ఈ విషయంపై విచారణ జరిపి హెల్త్ సెంటర్ నిర్మాణానికి సహకరించాలని వినతిపత్రం అందించడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో మీజూరు మధు బాబు,నీలేష్ ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular