ePaper
Thursday, October 29, 2026
Homeఎడిటోరియల్దళిత విద్యార్థుల భవిష్యత్తుపై చావుదెబ్బ..!

దళిత విద్యార్థుల భవిష్యత్తుపై చావుదెబ్బ..!

📰 Generate e-Paper Clip

💥కోట డా.బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేతపై ఆగ్రహం

💥చదువు హక్కును కాలరాస్తే సమాజ భవిష్యత్తునే దెబ్బతీసినట్టే

♦️పూర్వ విద్యార్థులు,ప్రజా సంఘాల ఆవేదన

కోట స్వర్ణసాగరం జులై 19

నెల్లూరు జిల్లాలో వేలాది మంది పేద దళిత విద్యార్థులకు విద్యా వెలుగులు నింపిన కోట మండలంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది.ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి,మీకు నచ్చిన ఇతర గురుకుల పాఠశాలల్లో పిల్లలను చేర్చుకోండి అంటూ విద్యార్థులను వారి సామాన్లతో బయటకు పంపించడం పట్ల పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు,బహుజన సంఘాలు,ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ (ఐఐటీ) పాఠశాల ఏర్పాటు పేరుతో ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న ఎస్సీ గురుకుల పాఠశాలను పూర్తిగా ఎత్తివేయడం సామాజిక న్యాయానికి విరుద్ధమని వారు పేర్కొంటున్నారు.పేద దళిత విద్యార్థుల చదువుకు భరోసాగా నిలిచిన విద్యాసంస్థను మూసివేయడం ద్వారా వారి భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని విమర్శిస్తున్నారు.తరగతులు ప్రారంభమై నెల రోజులు గడిచిన తర్వాత ఒక్కసారిగా విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్చుకోవాలని చెప్పడం వల్ల వారి చదువుకు తీవ్ర అంతరాయం కలిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి నిర్ణయాలు పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక,మానసిక భారం మోపుతున్నాయని పేర్కొన్నారు.పూర్వ విద్యార్థులు,బహుజన సంఘాల నాయకులు మాట్లాడుతూ,ఒక విద్యాసంస్థను అభివృద్ధి చేయాలంటే మరో పేదల విద్యాసంస్థను బలి చేయాల్సిన అవసరం ఏమిటి  అని ప్రశ్నించారు. ముఖ్యంగా ఎస్సీ విద్యార్థులకు చెందిన గురుకుల పాఠశాలనే ఎత్తివేయడం వెనుక వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి,దళిత విద్యార్థుల విద్యా హక్కులను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular