💥దళిత బిడ్డలకు చదువు దూరం చేయడం అంటే వారి భవిష్యత్తును చీకటిలోకి నెట్టడమే
♦️రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కును హరించే అధికారాన్ని ఎవరికీ ఇవ్వలేదు
🔷దళితులమనే కారణంతోనే మా పిల్లల విద్యాసంస్థను తొలగిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
🔶కోట ఎస్సీ గురుకులాన్ని వెంటనే పునరుద్ధరించాలి.లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం
🔵దళిత విద్యార్థుల కన్నీళ్లు తుడవాల్సిన ప్రభుత్వం వారి భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చడం బాధాకరం
💥విద్యార్థుల తల్లితండ్రులు,
బహుజన యూత్ ఫోర్స్ డిమాండ్లు
కోట స్వర్ణసాగరం జులై 21
కోట మండలంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలను ఎత్తివేయడంపై దళిత విద్యార్థుల తల్లిదండ్రుల,విద్యార్థులు, బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మంగళవారం గురుకులం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.పేద దళిత కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించిన గురుకులాన్ని అకస్మాత్తుగా మూసివేయడం వల్ల వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత విద్యార్థులను ఇతర గురుకులాల్లో చేరాలని సూచించడం అమానవీయ చర్య అని తల్లిదండ్రులు మండిపడ్డారు.ఇప్పటికే కొత్త వాతావరణానికి అలవాటు పడిన తమ పిల్లలను మధ్యలో పంపించడం వారి చదువుపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు,బహుజన నాయకులు మాట్లాడుతూ దళిత పిల్లలకు చదువే అసలైన ఆయుధమని,ఆ ఆయుధాన్నే ప్రభుత్వం లాక్కుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.దళితుల విద్యా హక్కులను కాలరాస్తూ సామాజిక న్యాయాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు.ఏళ్లుగా పేద దళిత కుటుంబాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న గురుకులాన్ని అకస్మాత్తుగా మూసివేయడంతో తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.పాఠశాల ప్రారంభమై చదువులు సాగుతున్న సమయంలో పిల్లలను వేరే గురుకులంలో చేరాలని చెప్పడం వల్ల సరైన వాతావరణం,సీట్లు లేక తమ బిడ్డలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.దళిత పిల్లలకు చదువే ఆస్తి ఆ ఆస్తిని కూడా లాక్కుంటే మేము ఎలా బతకాలి,మా పిల్లలు ఉన్నత విద్య చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని కలలు కన్నాం.ఇప్పుడు ఆ కలలు కళ్లముందే కూలిపోతున్నాయి అని పలువురు తల్లిదండ్రులు కన్నీటి స్వరంతో చెప్పారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి కోట డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలను తిరిగి ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు.గురుకులం పునఃప్రారంభమయ్యే వరకు తమ పోరాటం ఆగదని,ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.తక్షణమే కోట ఎస్సీ గురుకులాన్ని పునఃప్రారంభించి, విద్యార్థులకు అదే ప్రాంగణంలో విద్య కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కోట డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఎస్సీ గురుకులాన్ని పునఃప్రారంభించాలని వారు మరోసారి డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు బహుజన యూత్ ఫోర్స్ నాయకులు పాల్గొన్నారు.


