ఎమ్మెల్యే సునీల్ కుమార్ దృష్టికి సమస్య..వెంటనే నిధుల మంజూరు
ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుతో ముందుకొచ్చిన చాపల శ్రీనివాసులు
కోట స్వర్ణసాగరం ఆగష్టు 1
కోట మండలం కేశవరం పంచాయతీ ఎస్టీ కాలనీ ప్రజల చిరకాల తాగునీటి సమస్యకు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ చొరవతో పరిష్కారం లభించింది.
ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహాయ సహకారాలతో,కోట మండల తహసిల్దార్ జయ జయ రావు పర్యవేక్షణలో స్థానిక టీడీపీ నాయకుడు చాపల శ్రీనివాసులు ఆధ్వర్యంలో హై ప్రెజర్ లారీ బోరు సెట్ తో శనివారం బోరు సెట్ పనులు ప్రారంభించారు.ప్రజల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి అవసరమైన నిధులు మంజూరు చేయించి పనులకు శ్రీకారం చుట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల కలెక్టర్ నిర్వహించిన వన్ మంత్–వన్ విలేజ్–ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో కేశవరం పంచాయతీ ఎస్టీ కాలనీ ప్రజలు తాగునీటి సమస్యపై అర్జీ సమర్పించారు.ఈ అర్జీపై కోట మండల తహసిల్దార్,కేశవరం పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కటారి జయ జయ రావు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. కాలనీలో బోర్ ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.5 లక్షల నిధులు అవసరమని గుర్తించి, సమస్యను ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అవసరమైన నిధులను మంజూరు చేయించి ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి మార్గం సుగమం చేశారు.అయితే ప్రభుత్వ నిధుల మంజూరులో కొంత ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో,ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో స్థానిక టీడీపీ నాయకుడు చాపల శ్రీనివాసులు మానవత్వంతో ముందుకొచ్చారు.ప్రజల దాహార్తి తీర్చాలనే సంకల్పంతో తన సొంత నిధులతో ముందుగా బోర్ ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు.తదుపరి జడ్పీ నిధుల్లో బిల్లును సమర్పించి నిధులు అందజేసేలా చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ జయ జయ రావు తెలిపారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ, ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించడం అభినందనీయమని, అలాగే నిధుల కోసం ఎదురుచూడకుండా ప్రజల దాహార్తి తీర్చేందుకు తన సొంత నిధులతో బోర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన చాపల శ్రీనివాసుల సేవాభావం ప్రశంసనీయమని అన్నారు.ఎస్టీ కాలనీ తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కు,టీడీపీ నాయకుడు చాపల శ్రీనివాసులు కు,తహసిల్దార్ జయ జయ రావులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ జయ జయ రావు,,టీడీపీ నాయకులు చాపల శ్రీనివాసులు,చాపల విష్ణు,వి.కోటి.కె వెంకటేశ్వర్లు,సీ.హెచ్ ప్రభాకర్,ఎం.క్రిష్ణయ్య కోకొల్లు ముత్యాలయ్య,సచివాలయం సిబ్బంది,టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



