ePaper
Saturday, August 1, 2026
Homeఎడిటోరియల్కోటలో రిపబ్లిక్ డే రోజు కూడా ఆగని అక్రమ మద్యం అక్రమ అమ్మకాలు

కోటలో రిపబ్లిక్ డే రోజు కూడా ఆగని అక్రమ మద్యం అక్రమ అమ్మకాలు

📰 Generate e-Paper Clip

మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు

కోట స్వర్ణసాగరం జనవరి 25

కోట మండలం కోటలో రిపబ్లిక్ డే రోజును కూడా లెక్కచేయకుండా కోట రెడ్డి కళ్యాణమండపం రోడ్డు వద్ద ఉన్న బ్రాందీ షాపు మెయిన్ రోడ్డుపైన అక్రమ బెల్టు షాపు నిర్వహులు పబ్లిక్ గా ఓ స్కూటీలో మద్యం సీసాలను నిల్వ చేసుకొని అధిక ధరలు పెట్టి పబ్లిక్ గా వేకువజమున 5 గంటల నుండే అక్రమ మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. అదేవిధంగా ప్రతి బ్రాందీ షాపు సమీపంలో అక్రమ బెల్ట్ షాపు నిర్వహకులు ప్రత్యేక స్థావరాలను ఏర్పాటు చేసుకొని స్వేచ్ఛగా దర్జాగా అక్రమ మద్యం అమ్మకాలు జరుపుతున్నారు.సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులకు వారి వాటా వారికి వెళుతుందని భయపడాల్సిన పనిలేదని అక్రమ బెల్ట్ షాపుల నిర్వహకులు అంటున్నారు.ఇదే తరుణంలో కోట మండల పరిసర ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో అక్రమ బెల్టు షాపులు అడుగడుగునా వెలిసి ఉన్నాయి.రిపబ్లిక్ డే రోజు కూడా పల్లెల్లో గ్రామాలలో అక్రమ మద్యం ఏరులై పారుతుంది. ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం ప్రతీ బెల్టు వద్ద 5 వేల రూపాయలు తీసుకొని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు.,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular