ePaper
Saturday, August 1, 2026
Homeఎడిటోరియల్కోట ఎంఈఓ కార్యాలయంలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

కోట ఎంఈఓ కార్యాలయంలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జనవరి 13

కోట మండలం కోటలోని ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ దారా మస్తానయ్య ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.కార్యాలయ ఆవరణంలో ఇలా ఉద్యోగులు రంగు రంగుల ముగ్గులను వేసి ఆకర్షింప చేశారు.అనంతరం కార్యాలయ సిబ్బంది అందరూ కలిసి భోగి మంటను వేసి ఒకరికి ఒకరు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా ఎంఈఓ దారా మస్తానయ్య మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని కార్యాలయంలో తమ సిబ్బంది అందరూ కలిసి భోగి మరియు సంక్రాంతి ముందస్తు వేడుకలను  జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కోట మండల ప్రజలందరికీ ఎంఈఓ దారా మస్తానయ్య సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఈ ఓ 1,ఎంఈఓ 2,సి.ఆర్.పి లు, ఐ.ఈ.ఆర్.టి లు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular