ePaper
Wednesday, June 3, 2026
Homeఎడిటోరియల్నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోట పంచాయితీలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం

నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోట పంచాయితీలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం

📰 Generate e-Paper Clip

కోట మండలం కోట పంచాయతీ పరిధిలో టిడిపి నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుండి పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.నార్త్ గిరిజన కాలనీ కోట దళితవాడ,ఎన్.సి.ఆర్ నగర్,గమళ్ళపాలెం,రవి నగర్,అల్లారెడ్డి శ్యామసుందరపురం,ప్రగతి కాలేజ్ రోడ్డు,పరిసర ప్రాంతాలలో నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి చొరవతో జెసిబి లు,డోజర్లు,టాక్టర్ల సహాయంతో రోడ్లకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను,జంగిల్ క్లీనింగ్ చేస్తున్నారు.గ్రామాలలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తా చెదారాలను యంత్రాల సాయంతో పరిశుభ్రం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో  కోట పంచాయతీ పరిసర ప్రాంతాలు క్లీన్ అండ్ గ్రీన్ గా మారుతున్నాయి.ఈ సందర్భంగా కోట పంచాయతీ ప్రజలు మాట్లాడుతూ కోట పంచాయతీ పై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కోట పంచాయతీ అభివృద్ధికి పాటుపడుతున్న టిడిపి నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular