కోట స్వర్ణసాగరం జనవరి 24
స్వర్ణసాగరం దినపత్రికలో జనవరి 22 గురువారం ప్రచురించబడిన కోట దళితవాడలోని పంచాయతి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు శుభ్రం చేసి మా ఆరోగ్యాలను కాపాడండి అనే వార్తకు టీడీపీ నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి స్పందించారు.వినోద్ కుమార్ రెడ్డి ఆదేశాలతో కోట పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ శనివారం తమ సిబ్బందితో కోట దళితవాడలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేయించారు.ఈ నేపథ్యంలో కోట దళితవాడ ప్రజలు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డికి సెక్రటరీ రాజశేఖర్ కి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా నలపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోట పంచాయతీ పరిధిలో గ్రామాలలో అభివృద్ధి పనులలో ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.



