కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 1
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు పై కోట మండల టిడిపి శ్రేణులు మండిపడ్డారు.ఆదివారం కోట మండలం కోటలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద టిడిపి కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన టిడిపి మైనారిటీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో టిడిపి మండల పార్టీ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం అంబటి రాంబాబు దిష్టిబొమ్మను పెట్రోల్ పోసి దగ్ధం చేసి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు షేక్ జలీల్ అహ్మద్ మీజూరు మల్లికార్జునరావు తిరుమూరు మురళి లు మాట్లాడుతూ 50 సంవత్సరాలకుపైగా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి గౌరవాన్ని పెంచిన మహా నాయకుడు చంద్రబాబు నాయుడు అలాంటి ప్రజా నాయకుడి పై అంబటి రాంబాబు దుర్భాషలాడడం మంచి పద్ధతి కాదన్నారు.గతంలో వైసిపి నాయకులు చేసిన దూషణలకు ప్రతిఫలంగా రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పారని వైసిపి నాయకులు వైకిరి మార్చుకోకపోతే రానున్న ఎన్నికలలో సున్నా సీట్లకు పరిమితం చేసి రాష్ట్ర ప్రజలు రాజకీయాల నుండి తరిమికొడతారని ఈ సందర్భంగా వారు అంబటి రాంబాబును వైసిపి నాయకులను హెచ్చరించారన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి,చిలకూరు దశరథరామిరెడ్డి,వాకా విజయభాస్కర్ రెడ్డి,తిరుమల శెట్టి కోటేశ్వరరావు, మీజూరు మల్లికార్జునరావు, పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి,చాపల శ్రీనివాసులు,షేక్ షంషుద్దీన్, దారా సురేష్ తిరుమూరు మురళి,ఇన్నమాల అనూక్,మర్రిపోలయ్య,మీజూరు మధుబాబు,
సిద్ధప్పరెడ్డి రెడ్డి పోలమ్మ,టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



