ePaper
Wednesday, April 15, 2026
Homeఎడిటోరియల్గ్రూప్ 2 లో మెరిసిన ఆణిముత్యాలకు ప్రోత్సాహకాలు అందించిన చాపల శ్రీనివాసులు

గ్రూప్ 2 లో మెరిసిన ఆణిముత్యాలకు ప్రోత్సాహకాలు అందించిన చాపల శ్రీనివాసులు

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 2

ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్ 2 పరీక్షా ఫలితాల్లో విజేతలుగా నిలిచిన చిట్టేడు గ్రామానికి చెందిన ఇద్దరు ఆణిముత్యాలను సోమవారం చిట్టేడు సొసైటీ చైర్మన్ చాపల.శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.ఈ నేపథ్యంలో కోట మండలంలోని చిట్టేడు గ్రామానికి చెందిన జోక్కా వెంకటరమణయ్య కుమార్తె జోక్కా సుష్మిత,అదే గ్రామానికి చెందిన ముత్యాలపాటి విజయభాస్కర్ సునందమ్మ దంపతుల కుమారుడు ముత్యాలపాటి చైతన్య అను ఇద్దరూ గ్రూప్ -2 పరీక్షా ఫలితాల్లో విజేతలుగా నిలిచారు. ముత్యాలపాటి చైతన్య అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ కు ఎంపికయ్యారు.జోక్కా సుస్మిత గత నెలలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఎంపికయ్యారు.దీనితో ఇరువురు గ్రామంలో యువతకు ఆదర్శంగా నిలవడంతో బంధుమిత్రులు,తోటి ఉద్యోగస్తులు,గ్రామస్తులు అభినందనలు తెలియజేస్తున్నారు.ఈ మేరకు టీడీపీ నాయకుడు,చిట్టేడు సొసైటీ చైర్మన్ చాపల శ్రీనివాసులు,సొసైటీ డైరెక్టర్ చంద్రగిరి మధు ఆధ్వర్యంలో ఆణిముత్యాలు ముత్యాలపాటి చైతన్య,జొక్కా సుస్మితలను వారి వారి నివాసాలకు చేరుకుని వారికి శాలువాలు కప్పి,స్వీట్స్ అందజేసి ప్రోత్సాహక నిమిత్తం కొరకు ఐదువేల రూపాయలు చొప్పున ఇరివురుకి అందజేయడం జరిగింది. అనంతరం చిట్టేడు సొసైటీ చైర్మన్ చాపల శ్రీనివాసులు మాట్లాడుతూ,చంద్రగిరి మధు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు విజేతలకు ప్రోత్సాహక నగదు అందజేశామని తెలిపారు.చిట్టేడు గ్రామంలో ఇలాంటి జ్ఞానం కలిగిన ఉన్నతమైన విద్యావంతులు ఉండడం సంతోషదాయకంగా ఉందన్నారు.ఇలాంటి విద్యావంతులను ప్రోత్సహించి భవిష్యత్తులో ఉన్నత శ్రేణిలో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అభినందనలు తెలియజేశామని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో చిట్టేడు సొసైటీ చైర్మన్ చాపల శ్రీనివాసులు,సొసైటీ డైరెక్టర్ మధు,సీఈఓ కరుణాకర్ రెడ్డి,మద్దాలి మాజీ సర్పంచ్ హైమావతి,సొసైటీ సిబ్బంది, కేశవరం టిడిపి నాయకులు,మర్రిబోయిన కృష్ణయ్య,ఎంపికైన వారి తల్లిదండ్రులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular