కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 2
మాలల సామాజిక,రాజకీయ హక్కుల పరిరక్షణ,ఐక్యత కోసం ఏర్పడిన వేదికే మాల మహానాడు.దళితుల ఆత్మగౌరవం,ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా,మరియు మాలల సమస్యలపై పోరాటం చేస్తూ,ఈ మాల మహానాడు సంస్థ ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో బలంగా పనిచేస్తోంది.మాల కులస్తులందరినీ ఏకం చేసి, రాజకీయ పార్టీలకు అతీతంగా హక్కుల సాధన కోసం పోరాటం,ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకత,ఎస్సీ వర్గీకరణ (ఏబీసీడీ)మాలలకు అన్యాయం చేస్తుందని భావిస్తూ,దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.సామాజిక,రాజకీయ హక్కులు, దళితుల ఆత్మగౌరవం,విద్య,ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం కోసం పోరాటం,మాలలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ,ఆత్మరక్షణకు, హక్కుల కోసం ఈ సంఘం ఉద్యమిస్తోంది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణము నందు సోమవారం తిరుపతి పట్టణంలోని తిలక్ రోడ్డు ప్రెస్ క్లబ్ నందు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం,రాష్ట్ర కార్యదర్శి స్వర్ణ వెంకయ్య,రాయలసీమ ప్రధాన కార్యదర్శి యమల చంద్రయ్య,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతపర్తి శివయ్య,అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మల్లెల మోహన్,అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు గుండా మనోహర్ ల ఆధ్వర్యంలో మాల మహానాడు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల నూతన కమిటీ ని ప్రకటించారు.
మాల మహానాడు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులుగా మీజూరు మల్లికార్జునరావు నియమించడం జరిగింది.తిరుపతి జిల్లా పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులుగా మర్రి పోలయ్య,తిరుపతి పార్లమెంటు ప్రధానకార్యదర్శిగా బల్లి మధు, తిరుపతి పార్లమెంట్ కార్యదర్శిగా మీజూరు మురళీకృష్ణ,నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నల్లగట్ల నల్లగట్ల ప్రభావతి, నియమించడం జరిగింది.గూడూరు నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షులు గా దామవరపు బాలసుబ్రహ్మణ్యం నియమించడం జరిగింది.ఈ సందర్బంగా నూతన కమిటీని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం,రాష్ట్ర కార్యదర్శి స్వర్ణ వెంకయ్యలు శాలువా లు కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు దళితరత్న యామల సుదర్శనం మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి మాలపల్లి నుండి అత్యంత అత్యధికమైన జనాభాతో రాబోయే అసెంబ్లీ సమావేశాలను అమరావతిలో ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తిరుపతి మాలమహానాడు నాయకులు రాయపు పోలయ్య,చింతల ప్రేమ్ కుమార్,రోహిత్,తదితరులు పాల్గొన్నారు.



