ePaper
Saturday, June 13, 2026
Homeఎడిటోరియల్తీపలపూడి వీరాస్వామి కుటుంబానికి మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సహాయం

తీపలపూడి వీరాస్వామి కుటుంబానికి మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సహాయం

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 4

మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ తరపున కోట దళితవాడలో ఇటీవల మృతి చెందిన తీపలపూడి వీరాస్వామి కుటుంబానికి బుధవారం 5000 రూపాయల ఆర్ధిక సహాయం చేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ 2026 సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుండి మద్దాలి సర్వోత్తమ రెడ్డి ద్వారా తామంతా సభ్యులుగా ట్రస్ట్ ప్రారంభించడం జరిగిందని,ఈ ట్రస్ట్ ద్వారా ప్రస్తుతానికి కోట పంచాయతీ పరిధిలో ఎవరైనా పేద కుటుంబాల్లో వ్యక్తి చనిపోతే 5000 రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తున్నామని తెలిపారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టే పరిధిని విస్తరిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు తీగల సురేష్ బాబు తూపిలి రాథాక్రిష్ణారెడ్డి, పాలెపు సుధీర్ కుమార్ రెడ్డి,మర్రి అనీల్, డమ్మాయి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular