ePaper
Saturday, June 13, 2026
Homeఎడిటోరియల్నీటి సంఘాల సమావేశానికి విజయవాడ బయలుదేరిన బస్సు,

నీటి సంఘాల సమావేశానికి విజయవాడ బయలుదేరిన బస్సు,

📰 Generate e-Paper Clip

జండా ఊపి ప్రారంభించిన మండల టీడీపీ అధ్యక్షుడు,

స్వర్ణసాగరం- తొట్టంబేడు,

ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్‌రెడ్డి సూచనల మేరకు, నీటి సంఘాల అధ్యక్షులు ముఖ్యమంత్రి తో నిర్వహించే సమావేశానికి హాజరయ్యేందుకు విజయవాడకు బయలుదేరుతున్న బస్సును బుధవారం రాత్రి 10 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి జండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని తొట్టంబేడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావిళ్ళ మునిరాజా నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. నీటిపారుదల సమస్యలపై ప్రభుత్వ స్థాయిలో చర్చ జరగనున్న నేపథ్యంలో, ఈ సమావేశం కీలకంగా మారనుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సబ్‌డివిజన్ ఇరిగేషన్ డీఈ ప్రకాశ్, ఏఈ మునిమోహన్‌తో పాటు తొట్టంబేడు మండల నీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular