ePaper
Saturday, June 13, 2026
Homeఎడిటోరియల్కోటలోని శ్రీ ప్రగతి విద్యా సంస్థలో అగ్ని ప్రమాదాలపై మాక్ డ్రిల్

కోటలోని శ్రీ ప్రగతి విద్యా సంస్థలో అగ్ని ప్రమాదాలపై మాక్ డ్రిల్

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 18

అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు కోట మండలం కోటలోని శ్రీ ప్రగతి విద్యాసంస్థలు నందు శుక్రవారం విద్యార్థులకు మరియు సిబ్బందికి అగ్ని ప్రమాదాలపై ఫైర్ ఆఫీసర్ కె.శ్రీనివాసులు మాక్ డ్రిల్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ కె.శ్రీనివాసులు వారి సిబ్బంది అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలి భవనాల నుండి సురక్షితంగా ఎలా బయటపడాలో ఈ రిహార్సల్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు.స్కూలు కాలేజీలలో కచ్చితంగా యాజమాన్యం అగ్ని ప్రమాద నివారణ పరికరాలను ఉపయోగించాలని తెలిపారు.ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే స్థానిక అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వాలని కోరారు.భవిష్యత్తులో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.పాఠశాల యాజమాన్యం అగ్నిమాపక నియమాలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రగతి విద్యా సంస్థల అధినేత పసుపులేటి కిషోర్,పాఠశాల సిబ్బంది,అగ్నిమాపక సిబ్బంది విద్యార్థులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular