ePaper
Monday, April 20, 2026
Homeఎడిటోరియల్కోట గ్రామంపై ఎమ్మెల్యే కు ఉన్న మమకారానికి టీడీపీ నేత జలీల్ అహ్మద్ హర్షం

కోట గ్రామంపై ఎమ్మెల్యే కు ఉన్న మమకారానికి టీడీపీ నేత జలీల్ అహ్మద్ హర్షం

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 20

కోట గ్రామంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ చూపిస్తున్న మమకారానికి టీడీపీ నేత జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు.సోమవారం కోటలోని ఎ.వి.కె.ఆర్ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యార్థులకు సైకిల్లు పంపిణీ కార్యక్రమం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76 వ జన్మదిన వేడుకలలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రశంగించారు.ఈ సందర్భంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కొరకు తమ సొంత నిధులు రెండు లక్షల యాబై వేల రూపాయలు ప్రకటించారు.అంతేకాకుండా పాఠశాలలో 2 మరుగుదొడ్ల నిర్మాణానికి వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు.అదేవిదంగా విద్యార్థుల సౌకర్యార్థం చిట్టేడు గ్రామంలోని జి.వి.ఆర్ రొయ్యలు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ల్యాబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారని,నియోజకవర్గం స్థాయిలో విద్యార్థులకు సైకిల్ లు పంపిణీ కార్యక్రమం కూడా కోట గ్రామం వేదికగానే ప్రారంభించడం జరిగిందన్నారు.అదేవిదంగా నియోజకవర్గం స్థాయిలో ఎ.వి.కె. ఆర్ ఉన్నత పాఠశాలను అంతర్జాతీయ స్థాయి పాఠశాలకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో ఎంపిక చేసిన విషయం గుర్తు చేశారు.గతంలో టిడిపి ప్రభుత్వంలో మంజూరైన స్టేడియం పనులను గత వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదని మరల టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.నియోజకవర్గ స్థాయిలో అనేక మండలాలు,గ్రామాలు ఉన్న కోట గ్రామ అభివృద్ధిపై ఇంతటి మమకారాన్ని చూపిస్తున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular