ePaper
Friday, October 30, 2026
Homeఎడిటోరియల్పల్స్ పోలియో–ప్రతి చిన్నారికి రక్షణ-పల్లెమల్లు వెంకటకృష్ణా రెడ్డి

పల్స్ పోలియో–ప్రతి చిన్నారికి రక్షణ-పల్లెమల్లు వెంకటకృష్ణా రెడ్డి

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జూన్ 28

పల్స్ పోలియో ప్రతి చిన్నారికి రక్షణ అని తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెమల్లు వెంకటకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.ఆదివారం కోట మండలం గూడలి పంచాయతి పరిధిలోని పల్స్ పోలియో కేంద్రాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈసందర్భంగా పల్లెమల్లు వెంకటకృష్ణా రెడ్డి మాట్లాడుతూ
ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ సూచనలు మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు.పోలియో అనేది చిన్న పిల్లలను శాశ్వత వికలాంగులుగా మార్చే ప్రమాదకరమైన వైరస్ వ్యాధి.ఈ వ్యాధిని పూర్తిగా నివారించడానికి ప్రభుత్వం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి 0–5 సంవత్సరాల చిన్నారికి రెండు చుక్కల పోలియో మందు తప్పనిసరిగా వేయించాలన్నారు.పిల్లలకు ఇప్పటికే పోలియో టీకాలు వేసి ఉన్నప్పటికీ,పల్స్ పోలియో చుక్కలు కూడా వేయించడం చాలా ముఖ్యమని,ఇది పిల్లలకు అదనపు రోగనిరోధక శక్తిని అందించి,పోలియో వైరస్ వ్యాప్తిని అరికడుతుందన్నారు.చిన్నారుల
నిండు జీవితానికి రెండు చుక్కలు అనే సందేశాన్ని ప్రతి కుటుంబం గుర్తుంచుకుని, తమ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించి,పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,ఆశ వర్కర్లు,అంగన్వాడీ సిబ్బంది చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular