స్వాతంత్రానికి ముందు నుండి అనుభవం లోఉన్న భూ యజమానులు నేడు తారుమారు
మాభూములు మాకు ఇప్పించండి లేకుంటి కోర్టుకు పోతాం
వాలిమేడు,వాగర్రు,పాతేటిపాళెం,గ్రామాల్లోని భు సమస్యపై తహసీల్దార్ సయ్యద్ ఇగ్బాల్ కు వినతిపత్రం అందచేత
స్వర్ణసాగరం వాకాడు
స్వతంత్రానికి ముందు నుండి అనుభవం లోఉన్న భూ యజమానులు పేర్లు నేడు తారుమారయ్యాంటూ జడ్పీటీసీ రౌతు రామకృష్ణ ,గ్రామస్తులతో కలసి తహసీల్దార్ కు వినతిపత్రం అందచేశారు.ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడుతూ తరతరాలుగా 1961సం”నుండి దాదాపు65 సంవత్సరాలు స్వాతంత్రానికి మునుపు గూడూరు నియోజకవర్గాన్ని వెంకటగిరి రాజు పరిపాలిస్తున్న సమయంలో వాలిమేడు గ్రామానికి చెందిన 20 మంది రైతులకు అలాలమెట్ట వద్ద సర్వే నెంబర్ 1 నుండి 9 వరకు దాదాపుగా 85 ఎకరాలు పట్టాల పంపిణీ చేశారు.ఆభూములపై అప్పటి నుండి వెంకటగిరి రాజావారి దివానాకు శిస్తు కట్టుతూ ఆ భూముల్లో మిరప,తమదా వంటి పంటలు పండించుకుంటూ జీవనం సాగించేవారు. ఈమధ్య కాలంలో 20 సంవత్సరాల క్రితం జెమిన్ కొత్తపాలెం గ్రామానికి చెందిన కొందరు మా గ్రామస్తులతో చర్చలు జరిపి ఆ 85 ఎకరాలలో కొంత భూమి మేరకు మాకు ఇవ్వాలని వాళ్లు అడిగిన మినప 23 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందని.ఆ భూమిపై కూడా సర్వహక్కులు మావేనని ఆయన తెలిపారు.కాగా నేడు కేంద్ర ప్రభుత్వం తీరప్రాంతల అభివృద్ధి కొరకు చేపడుతున్న ఈ నౌకా నిర్మాణ కేంద్రానికి అవసరమైన భూములను భూసేకరణ కింద తీసుకునే క్రమంలో రెవెన్యూ సిబ్బంది సర్వే నిర్వహించే క్రమంలో 1 నుండి 9 వరకుసర్వే నెంబర్ పై మాగ్రామస్తుల పేర్లు కనిపించకుండా పోయాయాని 1961 నుండి దానిపై వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతుల పేర్లు లేకుండా ఉండడం పై అభ్యంతరాలు వ్యక్తం చేసారు.ఈ సమస్యపై తాసిల్దార్ సర్వే జరిపించి మా భూములు మాకు ఇప్పించాలని లేకుంటే కోర్టుకు వెళ్తామని పేద ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని వాళ్లకి తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు.అలాగే ఈ భూసేకరణ కార్యక్రమంలో భూములు కోల్పోతున్న ప్రతి ఒక్కరికి ఎకరాకు 45 లక్షల రూపాయలు ఇవ్వాలని దాన్ని ప్రతి ఒక్కరికి సమానంగా పంపిణి చెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేసారు ఈ విషయం స్పందించిన తహసీల్దార్ ఈ సమస్యపై పూర్తి సమాచారం తెలుసుకుని త్వరలో పరిష్కారం చూపుతామని తెలిపారు.


