తెలుగుదేశం పార్టీ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం
ముఖ్య అతిథులుగా సన్నారెడ్డి విజయ శేఖర్ రెడ్డి
ఎంపిటిసి అభ్యర్థి వాకాటి కోటయ్య జడ్పిటిసి అభ్యర్థి సన్నారెడ్డి అనిత ని గెలిపించాలంటూ పిలుపు
స్వర్ణసాగరం వాకాడు6
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కొండాపురం సెగ్మెంట్ లోని వడ్డీ పాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో ముఖ్యఅతిథిగా సన్నారెడ్డి విజయ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు శాలువా పూలమాలతో ఘన స్వాగతం పలికారు ఈ నేపథ్యంలో ఇంటింటికి తిరిగి జడ్పిటిసి ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఓటర్లను కోరారు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి లను దృష్టిలో పెట్టుకుని తెలుగు దేశం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అధికార పార్టీ గెలుసుకుంటే పంచాయితీ మరింత అభివృద్ధి పదంలో ఉంటుందని ఓటర్లకు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంగం అధ్యక్షులు చల్లా జనార్దన్, చెంచయ్య,మల్లి గిరి, వెంకటకృష్ణయ్య, మల్లి భాస్కర్, గుంజి సీనయ్య, మల్లి గోపి తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



