నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్, నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మమ్మ గిరిజన కాలనీలో ఇంటింటికి ప్రచారం
కోట బిట్ 3 ఎంపీటీసీ అభ్యర్థి సిద్దపరెడ్డి పోలమ్మ, జడ్పిటిసి అభ్యర్థి తిరుమూరు వజ్రమ్మ గెలిపించాలంటూ వినతి
స్వర్ణసాగరం కోట
మండల కేంద్రంలోని కోట సెగ్మెంట్ లోని తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం భారీ స్థాయిలో నిర్వహించారు. నెల్లూరు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోట బిట్ 3 లోని లక్ష్మమ్మ గిరిజన కాలనీలో ఎంపీటీసీ అభ్యర్థి సిద్ధారెడ్డి పోలమ్మ,జడ్పిటిసి అభ్యర్థి తిరుమూరు వజ్రమ్మ లను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లకు తెలియజేశారు.కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమా లను దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థల్లో కూడా కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలమని నాయకులు ఓటర్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు,తూపిలి రాధయ్య, మాణికల పవన్ కుమార్, దారా సురేష్, షంషుద్దీన్, నౌషద్ భాష, సోషల్ మీడియా అధ్యక్షులు మేజర్ మధుబాబు, వెంకటేష్, వెంకట్,నిలేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



