ఎంపీటీసీ అభ్యర్థి బొజ్జ సుభాషిణి, జడ్పిటిసి అభ్యర్థి ముప్పాల సదాలక్ష్మి ని గెలిపించమంటూ ఇంటింటికి ప్రచారం
వైసిపి నాయకులు దోసకాయల సురేష్ శ్రీధర్ విజయ్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో ప్రచారం
ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులు
స్వర్ణసాగరం వాకాడు
మండల పరిధిలోని దుగ్గరాజపట్నం సెగ్మెంట్లో దర్గామిట్ట, కొత్తూరు, గ్రామాల్లో వైసీపీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా దోసకాయల సురేష్, శ్రీధర్, ముప్పాల విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతస్థాయి ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారంలో జడ్పిటిసి అభ్యర్థి ముప్పాల సుధాలక్ష్మి,ఎంపీటీసీ అభ్యర్థి బొజ్జ సుభాషిణి ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు.గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన మంచిని గుర్తు చేస్తూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంది సమస్యలను పరిష్కరిస్తామని ఒక్కసారి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



