ePaper
Wednesday, April 15, 2026
Homeఎడిటోరియల్కోటలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తున్న జలీల్ భాయ్

కోటలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తున్న జలీల్ భాయ్

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జనవరి 19

కోట గ్రామపంచాయతీ అభివృద్ధిపై టీడీపీ నేత జలీల్ భాయ్ ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తున్నారు.ఈ నేపథ్యంలో కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో ప్రజల కోరిక మేరకు రామాలయం స్థలానికి,అంగన్వాడీ కేంద్రానికి గ్రావెల్ తోలించారు.కాలనీలోనీ కొందరు తమ వీధులలో సిమెంట్ రోడ్లు లేక వర్షాకాలంలో అనేక ఇబ్బందులుకు గురవుతున్నామని,గ్రావెల్ ని తోలించి వీదులను మరమ్మతులు చేయాలని జలీల్ అహమ్మద్ ని కోరారు.వెంటనే స్పందించిన జలీల్ అహ్మద్ కొన్ని గంటల వ్యవధిలోనే రోడ్లకు గ్రావెల్ తోలించి మరమ్మతులు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా జలీల్ అహ్మద్ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సహకారంతో గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందుబాటులో ఉంటారని సమస్యలను వారికి తెలియజేయాలని కోరారు.శ్యామసుందరపురం కాలనీవాసులు మాట్లాడుతూ తమకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్న షేక్ జలీల్ అహ్మద్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ షేక్ షంషుద్దీన్, నాయకులు నందం మోహన్,మధు సురేష్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular