కోట స్వర్ణసాగరం జనవరి 23
కోట మండలం కోట పంచాయతీలో శుక్రవారం ఎట్టికేలకు దోమలు నివారణ చర్యలు ప్రారంభం అయ్యాయి.గురువారం స్వర్ణ సాగరం దినపత్రికలో ప్రచురితం అయిన ఓ పంచాయతీ సారూ..మా కాలనీలో దోమలు మందు కొట్టండి సారూ..అనే వార్తకు పంచాయతీ అధికారులు స్పందించారు. ఈనేపథ్యంలో కోట పంచాయతీ అధికారి రాజశేఖర్ స్పందించి పంచాయతీ కార్మికులచే దోమల నివారణకు ఆయిల్ బాల్స్ లను డ్రైనేజీ కాలువలో వదిలారు.ఈ సందర్భంగా పంచాయతీ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ స్వర్ణసాగరం దినపత్రికలో ప్రచురితమైన వార్త కథనంపై ప్రజా ప్రతినిధులు సర్వసభ్య సమావేశంలో తెలియజేయడం జరిగిందని స్థానిక ఎంపీడీవో దిలీప్ కుమార్ నాయక్ ఆదేశాలతో దోమల నివారణ చర్యలు మొదలు పెట్టడం జరిగిందన్నారు.తదుపరి చర్యగా స్ప్రే మందులు, ఫాగింగ్ మిషన్ ద్వారా పిచికారి చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా కోట ప్రజలు పంచాయతీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో చిట్టేడు పి.హెచ్.సి డాక్టర్ నాగరాజు,ఎం.పి.హెచ్.ఈ.ఓ పెంచలయ్య, హెల్త్ అసిస్టెంట్ రమేష్ బాబు,ఎంపీటీసీ శంషుద్దీన్ ఉన్నారు.



