ePaper
Thursday, October 29, 2026
Homeఎడిటోరియల్కోట తహసీల్దార్ జయ జయ రావు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

కోట తహసీల్దార్ జయ జయ రావు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జులై 18

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం కోట తహసీల్దార్ జయ జయ రావు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, కార్యాలయ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని కార్యాలయ ప్రాంగణం,పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు.ఈ సందర్భంగా తహసీల్దార్ జయ జయరావు మాట్లాడుతూ,పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని అన్నారు.ప్రతి ప్రభుత్వ కార్యాలయం ప్రజలకు ఆదర్శంగా నిలవాలని, స్వచ్ఛతను ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో భాగంగా అలవర్చుకోవాలని సూచించారు.ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని,ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular