ePaper
Wednesday, July 29, 2026
Homeఎడిటోరియల్విద్యార్థుల మధ్య నేదురుమల్లి హరీష్ చంద్ర రెడ్డి జన్మదిన వేడుకలు

విద్యార్థుల మధ్య నేదురుమల్లి హరీష్ చంద్ర రెడ్డి జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

🔷వై.యస్.ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నేదురుమల్లి అభిమానులు

🔷భారీ కేక్ కట్ చేసి విద్యార్థులకు కేక్,పండ్లు,చాక్లెట్లు పంపిణీ

🔷గ్రామ అభివృద్ధికి హరీష్ చంద్ర రెడ్డి నాయకత్వం మరింత బలోపేతం కావాలని ఆకాంక్ష

కోట స్వర్ణసాగరం జులై 23

కోట మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన యువ నాయకుడు నేదురుమల్లి హరీష్ చంద్ర రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు గురువారం ఘనంగా నిర్వహించారు.హరీష్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ముందుగా గ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడంతో ప్రారంభమయ్యాయి. అనంతరం నాయకులు,అభిమానులు వైఎస్‌ఆర్ ఆశయాలను స్మరించుకుంటూ జన్మదిన వేడుకలను కొనసాగించారు.
తర్వాత కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో భారీ కేక్‌ను కట్ చేసి హరిచంద్ర రెడ్డి జన్మదినాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు కేక్,పండ్లు,చాక్లెట్లు పంపిణీ చేసి చిన్నారులతో కలిసి జన్మదిన వేడుకలను సంతోషంగా నిర్వహించారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొని హరీష్ చంద్ర రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నేదురుమల్లి హరీష్ చంద్ర రెడ్డి అభిమానులు మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న నేదురుమల్లి హరీష్ చంద్ర రెడ్డి అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో నిండి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.గ్రామ ప్రజల సంక్షేమం, యువత అభ్యున్నతి,సామాజిక సేవే లక్ష్యంగా ఆయన మరింత ముందుకు సాగాలని కోరుకున్నారు.కొత్తపాలెం గ్రామ అభివృద్ధి హరిచంద్ర రెడ్డి నాయకత్వంలో మరింత వేగవంతం కావాలని,ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన కీలక పాత్ర పోషించాలని అభిమానులు ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ ప్రజాసేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి ప్రజల ఆదరణను మరింత పొందాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బొర్రా ఏడుకొండలు,యానాటి రాంబాబు,మద్దెల రమేష్, దమరపు జయంత్,సురేష్,కృపాకర్, మస్తాన్,గోవర్ధన్, రమణయ్య,మధన్, శ్రీనివాసులు, శ్రీహరి,హరీష్,ప్రభూ,ప్రవీణ్, చంటి పోలయ్య తదితర హరీష్ అన్న అభిమానులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular