ePaper
Monday, November 2, 2026
Homeవాకాడుజాండ్రపేట గ్రామంలో వైసీపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో అపశృతి

జాండ్రపేట గ్రామంలో వైసీపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో అపశృతి

📰 Generate e-Paper Clip

 మద్యం మత్తులో మితిమీరిన వేగంతో ప్రచారం చేస్తున్న కార్యకర్తలపై దూసుకెళ్లిన కారు

 

ప్రమాదంలో కావలి వెంకటేష్ కు తీవ్ర గాయాలు అవ్వడంతో నెల్లూరు నారాయణ వైద్యశాల తరలించిన ఏనుగు సుధాకర్ నాయుడు

 

ప్రమాదంలో దెబ్బతిన్న డిజైర్ కారు ద్విచక్ర వాహనం

 

స్వర్ణసాగరం వాకాడు

 

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కొండాపురం సిగ్మెంట్ లోని జాండ్రపేట గ్రామంలో వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు ఏనుగు సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వెంకటగిరి సమీపంలోని గొల్లపల్లి నుండి తూపిలిపాలెం సముద్రం దగ్గరకు వచ్చి మద్యం సేవించి తిరుగు ప్రయాణంలో మితిమీరిన వేగంతో కారును నడుపుతూ పక్కన నిలిపిన డిజైర్ కారును, ద్విచక్రవాహాన్ని గుద్దుకుంటూ ప్రచారంలో ఉన్న కార్యకర్తలపై దూసుకెళ్లడంతో కావాలి వెంకటేష్ అనే యువకుడి కు తీవ్ర గాయాలపాలై అస్వస్థతకు గురైనాడు వెంటనే గ్రామస్తులు స్థానిక వైసీపీ నాయకుడు ఏనుగు సుధాకర్ నాయుడుకు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందిచి క్షతగాత్రుడిని నెల్లూరు లోని నారాయణ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదం చేసిన వ్యక్తులను గ్రామస్తులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై స్పందించిన సబ్ ఇన్స్పెక్టర్ నిఖిల్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియచేసారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular